క్రిష్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలిసిపోయింది..!!

క్రిష్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలిసిపోయింది..!!

0
140

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తాజాగా ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ముగ్గురు దర్శకులు మరియు ముగ్గురు హీరోయిన్లు ఉండటం విశేషం. సినిమాను మూడు భాగాలుగా విభజించి ఒక్కో భాగానికి ఒక్క దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడన్నమాట. తాజా సమాచారం ప్రకారం ఆ ముగ్గురిలో ఒక దర్శకుడు ప్రముఖ డైరెక్టర్ క్రిష్ అని తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ క్రిష్ ఈ సినిమాలో ఒక భాగానికి దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ మధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ తో అనుకోని విధంగా డిజాస్టర్ల ను అందుకున్న క్రిష్ ఎలాగైనా మళ్లీ ఒక హిట్ అందుకొని ఫామ్ లోకి రావాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. బాలీవుడ్లో ‘మణికర్ణిక’ సినిమా దర్శకత్వం విషయంలో వచ్చిన కలహాల వల్ల కూడా బాగా డిస్టర్బ్ అయిన క్రిష్ ఈసారీ కచ్చితంగా హిట్ అందుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా మిగతా రెండు భాగాలకు ఎవరు దర్శకత్వం వహించనున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో కూడా క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.