కుమారుడి విషయంలో బాలయ్య హమీ

కుమారుడి విషయంలో బాలయ్య హమీ

0
91

బాలయ్య బాబు చాలా స్పీడుగా సినిమాలు చేస్తున్నారు.. ట్రాక్ పై రెండు సినిమాలు పెట్టారు. డిస్కషన్ లో మూడు సినిమాలు ఉన్నాయి.. ఓ పక్క ఎమ్మెల్యేగా మరోపక్క నటుడిగా ఆయన బిజీ బిజీగా ఉన్నారు. అంతేకాదు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కూడా ఆలోచిస్తున్నాడు. నటులు వారి వారసుల సినిమా అరంగేట్రం కోసం చూస్తారు. బాలయ్య బాబు కూడా అదే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

నందమూరి హీరోలు కొత్తగా వారి వంశం నుంచి వచ్చి 13 సంవత్సరాలు అయింది. అందుకే బాలయ్య బాబు తనయుడి సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్.. బాలయ్య సినిమారంగంలో దూసుకుపోతున్నారు. ఇక మెగా అక్కినేని కుటుంబాలలో వారసులు పదుల సంఖ్యలో సినిమాలు చేస్తున్నారు.. బాలయ్య బాబు అదే ఆలోచన చేస్తున్నారట.ఇప్పటికే 23 వఏట అడుగు పెట్టాడు మోక్షజ్ఞ.

ఆయన వ్యాపారాల్లోకి వెళతాడు అని సినిమాలు చేయడు అని అనేక వార్తలు ఇటీవల వినిపించాయి.. కాని ఇది వాస్తవం కాదు అని తెలుస్తోంది. బాలయ్య తన వారసుడిని సినిమాల్లోకి తీసుకువస్తారట. చదువులో ఉన్నాడు తనని ఇబ్బంది పెట్టకుండా చదువు అయ్యాక సినిమాలు చేయిస్తా అని బాలయ్య అభిమానులతో అన్నారట.