త్వరలో పెళ్లిచేసుకోబోతున్న లేడీ సూపర్ స్టార్..వేదిక ఎక్కడంటే?

0
36

లేడీ సూపర్ స్టార్ నయనతార ఎన్నో సినిమాలలో నటించి ఎనలేని గుర్తింపు సాధించుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి అర్ధం ఉన్న కథలను ఎంచుకొని ప్రేక్షకులను తనసొంతం చేసుకుంది. విగ్నేష్‌ శివన్‌ కూడా దర్శకుడిగా మనకు పరిచయం అయ్యి నయనతారతో ప్రేమలో పడ్డాడు. అయితే వీరిద్దరి ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వీరిద్దరూ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. వీరికి ప్రేమకు ముగింపు పలుకుతూ..వివాహ జీవితంలోకి అడుగులు వేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. మనందరం ఎదురు చుసిన విధంగానే వీరి పెళ్లి త్వరలో జరగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బంధువులకు, అతిథులకు డిజిటల్ ఇన్విటేషన్ వీడియో కూడా పంపించినట్టు సమాచారం తెలుస్తుంది.

ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఒక డిజిటల్ ఇన్విటేషన్ కార్డు వీడియో ఇదే అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక అందులో ఉన్న సమాచారం ప్రకారం జూన్ 9వ తేదీన మహాబలిపురంలో ఉన్న మహబ్ హోటల్లో వీరి పెళ్లి జరగడంతో పాటు..చెన్నైలో వెడ్డింగ్ రిసెప్షన్ కూడా జరిగే అవకాశం ఉందట.