లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఆ రోజే

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఆ రోజే

0
93

రామ్ గోపాల్ వర్మ తాజాగా తీసిన చిత్రం ”లక్ష్మీస్ ఎన్టీఆర్ ” ఈ సినిమా విడుదలకు అడ్డంకి తొలగిపోయింది . లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదల అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరిన విషయం తెలిసిందే . దాంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 22 న విడుదల అవుతుందా ? లేదా ? అన్న అనుమానం నెలకొని ఉండే కానీ తాజాగా ఎన్నికల సంఘం ఈ విషయం పై స్పందించడంతో రిలీజ్ కి అడ్డంకి తొలగిపోయింది .

ఈ సినిమా రిలీజ్ ని ఎన్నికల సంఘం అడ్డుకోదు ,కాకపోతే ఒక వ్యక్తికీ , పార్టీకి లాభం చేకూరేలా సన్నివేశాలు ఉంటే అప్పుడు చర్యలు తీసుకుంటాం కానీ రిలీజ్ కాకుండా అడ్డుకోలేమని తేల్చి చెప్పాడు రజత్ కుమార్ . ఎన్నికల సంఘం ఆంక్షలు లేవు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈనెల 22న రిలీజ్ కానుంది.చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని వివాదాలు ఉంటాయో.