లైగర్ నుంచి బిగ్ అప్డేట్..కోకా 2.0 సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

0
47

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ లైగర్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. విజయ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ ఆకట్టుకోనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి.  ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్.

తాజాగా ఈ చిత్రం నుండి మూడో సాంగును విడుదల చేయనున్నట్లు హీరో విజయ్ దేవరకొండ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కోకా 2.0 అనే పాటని నేడు ( శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ ఎలా ఉంటుందోనని అభిమానులలో ఉత్కంఠ నెలకొంది.