పూజా హెగ్డేతో లిప్ లాక్ సీన్..ప్రభాస్ హాట్ కామెంట్స్

0
103

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్ర రాధేశ్యామ్. ఈ సినిమాను టాలీవుడ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో తెరకెక్కతోంది. పీరియాడిక్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్, గ్లింప్స్‌తో అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. రాధేశ్యామ్ ప్రమోషన్లలో ప్రభాస్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు గురించి విలేకరి ప్రశ్నించినప్పుడు ప్రభాస్ మాట్లాడుతూ..”రాధేశ్యామ్‌లో రొమాంటిక్ సీన్‌లు ఉన్నాయి. ప్రేమ కథా చిత్రం కాబట్టి ఆ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. అప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాను. లిప్‌లాక్ సీన్లు కూడా చేశాను. లవ్ స్టోరీ కాబట్టి రొమాంటిక్ సీన్లలో నటించనని చెప్పలేం కదా. ముఖ్యంగా లిప్ లాక్ సీన్ చేసేటప్పుడు షర్ట్ లేకుండా చేయాల్సి వచ్చిందన్నారు. సెట్‌లో చాలా మంది ఉన్నారుగా.. మరో లోకేషన్‌లో చేద్దాం అని డైరెక్టర్‌తో అంటే.. రాజమౌళి ఛత్రపతి సినిమాలో తన చేత షర్ట్ విప్పించారని గుర్తు చేసి మరీ రొమాంటిక్ సీన్లలో నటింపజేశారు అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

రాధేశ్యామ్ సినిమాలో కాకుండా ఇంతకుముందు లిప్‌లాక్‌ను బాహుబలిలో అనుష్కతో చేశారు. సాహోలో శ్రద్ధా కపూర్‌తోనూ అలాంటి ఓ సన్నివేశం ఉంటుంది. అయితే పూర్తి స్థాయి రొమాంటిక్ సన్నివేశాలున్న చిత్రంలో నటించడం మాత్రం ప్రభాస్‌కు ఇదే మొదటి సారి.