ఈ లాక్ డౌన్ సమయంలో చాలా మంది హీరోలు షూటింగ్ కి బ్రేకులు ఇవ్వడంతో ఇంటి పట్టున ఉన్నారు, అయితే ఈ సమయంలో కొత్త కధలు కూడా చాలా మంది హీరోలు విన్నారు, దర్శకులు హీరోలు ఈ కథల పై బాగా వర్క్ చేశారనే చెప్పాలి, టాలీవుడ్ లో దాదాపు 10 సినిమాలకు కథలపై ఈ నాలుగు నెల్లలో వర్క్ జరిగింది.
అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ కథ విన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న ప్రశాంత్, ప్రస్తుతం కేజీఎఫ్ 2చిత్రాన్ని చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత ఆయన తారక్ తో సినిమా చేయనున్నారు. అయితే ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఆయన తారక్ ని కలిసి ఓ కథ వినిపించారట. మరోసారి డిస్కషన్ లో ఇక కొద్ది మార్పులతో చిత్రం ఫైనల్ అవుతుంది అని తెలుస్తోంది.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పాన్ ఇండియా చిత్రంగా నిర్మించడానికి ముందుకువచ్చింది అని తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ మూవీ తర్వాత ఈ చిత్రం చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.