బ్రేకింగ్ – గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర

బ్రేకింగ్ - గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర

0
49

బంగారం ధ‌రలు రెండు రోజులుగా త‌గ్గుతూనే ఉన్నాయి, తాజాగా మ‌ళ్లీ బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఈ రోజు కూడా బంగారం ధ‌ర భారీగా త‌గ్గింది, దాదాపు నిన్న‌టి సాయంత్రం నుంచి నేటి ఉద‌యం వ‌ర‌కూ 1300 రూపాయ‌లు 10 గ్రాముల‌కి త‌గ్గింది ప‌సిడి ధ‌ర‌.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 త‌గ్గింది. దీంతో ధర రూ.58,300కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.440 త‌గ్గ‌డంతో రూ.53,140కు దిగొచ్చింది. నిన్న‌టితో పోలిస్తే 1300 ధ‌ర త‌గ్గింది.

పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2650 పడిపోయింది. దీంతో ధర రూ.72,500కు దిగొచ్చింది. ఇక బంగారం వెండి ధ‌ర‌లు వ‌చ్చే రోజుల్లో మ‌రింత త‌గ్గుతాయి అంటున్నారు, షేర్ల‌లో మ‌ళ్లీ పెట్టుబ‌డులు పెట్ట‌డంతో బంగారం ధ‌ర‌లు ఒక్క‌సారిగా భారీగా త‌గ్గుతున్నాయి.