మహర్షి సినిమా కథ నాది..కాపీ కొట్టేశారు – డైరెక్టర్ శ్రీవాస్..!!

మహర్షి సినిమా కథ నాది..కాపీ కొట్టేశారు - డైరెక్టర్ శ్రీవాస్..!!

0
103

మహేష్ బాబు కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’.. ఇటీవలే విడుదలై మంచి టాక్‌ను సంపాదించుకుంది. భారీ వసూళ్లను కూడా రాబడుతుంది. అయితే ఈ సినిమా విషయమై దర్శకుడు శ్రీవాస్ నిర్మత దిల్ రాజ్ పై సంచలన అరోపణలు చేశాడు. మహర్షి కథ నాదని దాని దిల్ రాజు కాపీ కొట్టారని కుండ బద్దలు కొట్టాడు. కొన్నేళ్ల క్రితం ఈ కథను నిర్మాతకు చెప్పానని, మహర్షి సినిమా నా కథకు దగ్గరగా ఉందని ఆయన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

గతంలో రామ రామ కృష్ణ కృష్ణ అనే సినిమాను దిల్ రాజుతో శ్రీవాస్ రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీవాస్ చేసిన అభ్యంతరాలపై దిల్ రాజు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ వివాదాన్ని పెద్దగా చేయకుండా తనతో మరో సినిమాకు నిర్మాతగా రూపొందిస్తానని శ్రీవాస్‌కు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకున్నారు. గతంలో దిల్ రాజు నిర్మించిన మిస్టర్ ఫర్‌ఫెక్ట్ సినిమాను కాపీరైట్ వివాదం వెంటాడింది. ఇటీవల బాధితుడికి అనుకూలంగా కోర్టు తీర్పు వెల్లడించింది. చాలా కాలంగా మిస్టర్ ఫర్‌ఫెక్ట్ కోర్టు వివాదంలో నలిగిన సంగతి తెలిసిందే. మహర్షి సినిమాపై ప్రేక్షకులు, ఫ్యాన్స్ కూడా సానుకూలంగా స్పందించడంతో మంచి కలెక్షన్లను సాధిస్తున్నది.