సోషల్ మీడియాలో త‌మ‌న్నా, కాజ‌ల్ ఫోటోలు వైరల్..!!

సోషల్ మీడియాలో త‌మ‌న్నా, కాజ‌ల్ ఫోటోలు వైరల్..!!

0
55

రెండు కొప్పులు ఒకే ద‌గ్గ‌ర ఉండ‌వు అంటారు కదా.. అలాంటిది ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు ఒకే చోట ఎలా ఉన్నారబ్బా అనుకుంటున్నారా..? అవును.. న‌మ్మ‌డం కాస్త క‌ష్ట‌మే అయినా కూడా ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది మ‌రి.తాజాగా త‌మ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న కెమిస్ట్రీ చూపించ‌డానికి ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని పిక్స్ షేర్ చేసింది త‌మ‌న్నా. అందులో చంద‌మామ కాజ‌ల్ అగర్వాల్‌తో క‌లిసి అదిరిపోయే పోజిచ్చింది. ఇవిప్పుడు బాగానే వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సినిమాలో కూడా క‌లిసి న‌టించ‌లేదు కానీ స్నేహం మాత్రం చాలా ఎక్కువ‌గా ఉంది.

ఈ బంధం బ‌లంగా ధృడంగా క‌నిపిస్తుంది. అయితే క‌లిసి న‌టించ‌క‌పోయినా కూడా క‌లిసి ఒకే సినిమా రీమేక్‌లో న‌టిస్తున్నారు. అదే క్వీన్.. ఈ సినిమా తెలుగు రీమేక్ త‌మ‌న్నా చేస్తుంటే.. త‌మిళ రీమేక్ కాజ‌ల్ చేస్తుంది. దాంతో అక్క‌డ ఈ ఇద్ద‌రి మ‌ధ్య మ‌రింత స్నేహం ఏర్ప‌డింది. ఏదేమైనా ఇప్పుడు త‌మ‌న్నా, కాజ‌ల్ మ‌ధ్య ఉన్న స్నేహాన్ని, కెమిస్ట్రీని చూసి క్యా సీన్ హై అంటూ అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు.