అరవింద సామెత కోసం మహేష్ బాబు

అరవింద సామెత కోసం మహేష్ బాబు

0
90

జూ.ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అక్టోబర్ 2న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ ‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చీఫ్ గెస్ట్‌గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ వస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ సినిమాకు మహేశ్ వస్తే చాలా ప్లస్ అవుతుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు టాక్. ఈ కారణంగానే మహేశ్ ఈ ఫంక్షన్‌కు వస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు త్రివిక్రమ్‌తో మహేశ్‌కు సన్నిహిత సంబంధాలు ఉండడం కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది. ఇదే కనుక నిజమైతే ఇద్దరు స్టార్ హీరోల అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.