గూఢచారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు..!

గూఢచారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు..!

0
137

‘భరత్ అనే నేను’.. ‘మహర్షి’ .. ‘సరిలేరు నీకెవ్వరు’తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన మహేశ్ బాబు, తన తదుపరి సినిమాకి సిద్ధమవుతున్నాడు. ఆయన తదుపరి సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడనీ, ‘స్పై’ పాత్రను ఆయన పోషించనున్నాడని అంటున్నారు.

మహేష్ కోసం ఓ స్టైలిష్ స్పై ద్రిల్లర్ రెడీ చేసాడట వంశీ. ఈ సినిమా హాలీవుడ్ జేమ్స్ బాండ్ తరహాలో సాగుతుందని తెలుస్తుంది. కృష్ణ కూడా మహేష్ బాబును జేమ్స్ బాండ్ తరహా పాత్రలో చూడాలని అనుకుంటున్నాడట. గతంలో ‘స్పైడర్’ సినిమాలో మహేష్ ఆ తరహా పాత్రలో నటించినప్పటికీ కానీ ఫలితం దక్కలేదు. ఇప్పుడు పక్క ప్లానింగ్ తో పకడ్బంధితో రాబోతున్నాడట మహేష్.

ఇక ఈ సినిమాలో ‘భరత్ అనే నేను’ ఫేం కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతుండగా తమన్ మ్యూజిక్ అందించబోతున్నాడని తెలుస్తుంది.