మహేశ్ బాబు, రాజమౌళి కలిసి పరిచయం చేసిన ‘నాయకుడు’

-

తమిళంలో తాజాగా విడుదలై సంచలనం సృష్టించిన ‘మామన్నన్’ తెలుగులో ‘నాయకుడు’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin), వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌కి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌(Nayakudu Trailer)ను సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ ఆద్యంతం హార్డ్ హిట్టింగ్‌గా సాగింది. వడివేలు, ఉదయనిధి స్టాలిన్ కొండపై నిలబడి నగరాన్ని చూస్తుండగా, తుపాకీ పేల్చి ఫహద్ ఫాసిల్ పాత్ర పరిచయం అవుతుంది. వడివేలు, ఉదయనిధి ఒకవైపు.. ఫహద్‌ మరోవైపు.. వీరి మధ్య పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ఉండబోతుందని ట్రైలర్ ఎస్టాబ్లిష్ చేసింది. వడివేలు, ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్‌ల ఫెర్ ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలెట్ అనేలా ఉంది. ‘దసరా’ తర్వాత కీర్తి సురేష్ మరోసారి అలాంటి తరహా పాత్రలో కనిపిస్తున్నట్లుగా ఈ ట్రైలర్(Nayakudu Trailer) చూస్తుంటే తెలుస్తోంది.

- Advertisement -
Read Also: పవన్-సాయితేజ్ బ్రో సినిమా అప్‌డేట్.. అదిరిపోయిన కొత్త పోస్టర్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...