ఆహా బాలయ్య షోలో మహేష్ బాబు ఎంట్రీ అదుర్స్- వీడియో

Mahesh Babu Entry Adurs- Video In Aha Balayya Show

0
110

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ అనే టాక్ షో ఆహా ఓటిటిలో వస్తున్న సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ షోకు మంచు కుటుంబం, రాజమౌళి, థమన్, రానా, రవితేజ గెస్టులుగా వచ్చారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ షోలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్‌లో మహేష్ బాబు తన కెరీర్‌కు సంబంధించిన ముచ్చట్లతో పాటు ఇంకా చాలా విషయాలు చర్చించాడని తెలుస్తుంది. పైగా బాలయ్య షోలో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందని.. ఎంజాయ్ చేసానంటూ ట్వీట్ కూడా చేసాడు సూపర్ స్టార్. ఆయన హోస్టింగ్ కూడా సూపర్ అంటున్నాడు ఈయన. ఇదిలా ఉంటే అన్‌స్టాపబుల్‌లో మహేష్ బాబు ఎపిసోడ్ కోసం సూపర్ స్టార్ అభిమానులు వేచి చూస్తున్నారు.

https://youtu.be/L6CKONLjmRA