మహేష్ బాబు సర్కారు వారిపాట స్టోరీ ఇదేనంటూ టాక్స్ ?

మహేష్ బాబు సర్కారు వారిపాట స్టోరీ ఇదేనంటూ టాక్స్ ?

0
106

ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా సరిలేరు నీకెవ్వరు తర్వాత చేస్తున్న సినిమా సర్కారు వారిపాట… ఇక తాజాగా పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమాని ప్రకటించారు చిత్ర యూనిట్, మొత్తానికి వైరస్ లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా సెట్స్ పై కి రానుంది, ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

ఇక ఈ చిత్ర పోస్టర్ చూసిన అభిమానులకి మహేష్ లుక్ అందులో మరీ ముఖ్యంగా వన్ రూపీ టాటు బాగా నచ్చింది, డిఫరెంట్ గా మహేష్ చెవికి పోగు ఇవన్నీ సినిమా పై అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా ఆర్ధిక రంగం బ్యాంకింగ్ రంగం మీద ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో మహేష్ బాబు ఓ బ్యాంకు ఉద్యోగి కొడుకుగా నటిస్తారని.. బ్యాంకు స్కాముల కారణంగా తన కుటుంబానికి ఎదురైన ఆర్థిక సమస్యలు.. ఇతర సమస్యలకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు అని అంటున్నారు, మొత్తానికి చాలా డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఈ సినిమా రెడీ చేశారట పరశురామ్
ఇక సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే , కీర్తి సురేష్ ప్రేర్లు ప్రచారంలో ఉన్నాయి.