సుకుమార్, శ్రీకాంత్ అడ్డాలా, పూరి లపై మహేష్ కి ఎందుకంత కోపం..!!

సుకుమార్, శ్రీకాంత్ అడ్డాలా, పూరి లపై మహేష్ కి ఎందుకంత కోపం..!!

0
65

నిన్న జరిగిన మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ మాట్లాడుతూ తన 25 సినిమాలలో థాంక్స్ చెప్పాల్సిన దర్శకులు ఉన్నారని పేరు పేరు న ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాడు.. కానీ కొన్ని పేర్లు మాత్రం మహేష్ స్టేజి మీద చెప్పకుండా దాటేశాడు.. వారి పేర్లు చెప్పడానికి కూడా అయన ఇష్టపడలేదు.. తనకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుల పేర్లు చెప్పకుండా మహేష్ దాటవేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది..

మరి ఇదంతా చూస్తుంటే మహేష్ మనసులో ఏదో పెట్టుకునే ఇలా చేశాడా? అనే డౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రైజ్ అయ్యింది. మహేష్ కి మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పూరి జగన్నాధ్ ని మహేష్ మరిచాడు. పోకిరి లాంటి హిట్ ఇచ్చిన పూరిని మహేష్ మరవడం మాత్రం కాస్త ఆశ్చర్యమే. బిజినెస్ మ్యాన్ ద్వారా కూడా మహేష్ కి హిట్ ఇచ్చిన పూరీని మహర్షి ఈవెంట్ లో కనీసం తలవకపోవడం అనేది ఆలోచించాల్సిందే.

రంగస్థలం హిట్ దర్శకుడు సుకుమార్ కి మహేష్ హ్యాండ్ ఇచ్చాడు. మహేష్ తో సినిమా కోసం ఏడాది వెయిట్ చేసిన సుకుమార్ ని కూడా మహేష్ పక్కన పెట్టేసాడు. మహర్షి ఈవెంట్ లో సుకుమార్ పై కూడా మహేష్ ఇండైరెక్ట్ గా ”ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ దగ్గరయినా కథ ఉంటే ఒక రెండు నెలలు ఆలస్యమైతే చాలు.. వేరే హీరోల దగ్గరకు వెళ్లిపోతారు. కానీ అలా కాకుండా నా కోసం రెండేళ్లు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ వంశీ.” అని చెప్పాడు.