అలాంటి వాళ్లంటే ఇష్టం ఉండదు దూరంగా పెడతా – మహేష్ బాబు

అలాంటి వాళ్లంటే ఇష్టం ఉండదు దూరంగా పెడతా - మహేష్ బాబు

0
87

సరిలేరు నీకెవ్వరు ఈ చిత్రం ఈ ఏడాది సూపర్ సక్సెస్ అందించింది మహేష్ బాబుకి, ఇక ఆయన కెరియర్లో బెస్ట్ పిక్చర్ గా నిలిచింది, రికార్డులు బద్దలు కొట్టింది ఈ చిత్రం…టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మీ గురించి మూడు ముక్కల్లో చెప్పండి అంటే, హంబుల్ హంబుల్ హంబుల్ అని చెప్పారు, తాను చాలా అణకువగా ఉంటాను అని అన్నారు. మీరు సినిమా రంగంలో మరిచిపోలేని ఘటన ఏది అంటే ..వెంటనే మురారి సినిమాకి చూసిన తర్వాత మా నాన్న కృష్ణగారు తన భుజం తట్టి అభినందించారు అది ఎప్పటికి మర్చిపోలేను అన్నారు.

మధురమైన రొమాంటిక్ క్షణాలు ఏవి అంటే ఓ మాంచి సినిమాను తన భార్యతో కలిసి చూడడమే రొమాంటిక్ అని వెల్లడించారు.నిజాయతీ లేని వ్యక్తులంటే తనకు అస్సలు నచ్చదని స్పష్టం చేశారు. ఇక తనపై బయోపిక్ తీస్తే ఎవరు నటిస్తే బాగుంటుంది అని ప్రశ్నిస్తే, నాది సాధారణ జీవితం అని ఆయన చమత్కరించారు.