మళ్ళీ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న మహేష్.. ఈసారి కూడా హిట్ పక్కా..!!

మళ్ళీ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న మహేష్.. ఈసారి కూడా హిట్ పక్కా..!!

0
105

మహేష్ బాబు హీరోగా రాబోతున్న చిత్రం మహర్షి.. మే 9 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అవుతుండగా మే 1 న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా లో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుండగా దిల్ రాజు, అశ్వినీదత్ ఈ సినిమా ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు..

కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నెక్ లెస్ రోడ్ లో మే 1 న జరుగుతుండగా ఈ ఫంక్షన్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నారట.. ఇప్పటికే మహేష్ బాబు భరత్ అను నేను సినిమా కి ఎన్టీఆర్ గెస్ట్ గా రాగ ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. కాగా ఇప్పుడు ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అయితే మహేష్ కి మరో హిట్ ఖాయం అని ముందే ఖరారు చేసినట్లవుతుంది. అయితే ఈ సినిమా కి మరో గెస్ట్ గా రామ్ చరణ్ పేరు కూడా వినపడుతుంది.. నిజానికి భరత్ అను నేను కి కూడా ఈ ఇద్దరు హీరోలు గెస్ట్ లుగా రావాలి కానీ ఎన్టీఆర్ ఒక్కడే వచ్చాడు.. ఇప్పుడు చెర్రీ కూడా వస్తాడేమో చూడాలి.. ఇక వీరిద్దరూ కలిసి RRR సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే..