జగన్ స్విట్జర్లాండ్ లో ఏం చేస్తున్నారో బయటపడింది

జగన్ స్విట్జర్లాండ్ లో ఏం చేస్తున్నారో బయటపడింది

0
91

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాస్త రిలాక్స్ అయ్యారు.. ముఖ్యంగా జగన్ కూడా రిలాక్స్ మూడ్ లోకి వెళ్లారు.. గడిచిన మూడు నెలలుగా ఎన్నికల ప్రచారాలతో బిజీగా ఉన్న జగన్, కాస్త కుటుంబంతో కలిసి ఫారెన్ టూర్ వెళ్లారు. కాని దీనిని కూడా తెలుగుదేశం నేతలు రాద్దాంతం చేస్తున్నారు. ఏపీ విషయాలను పక్కన పెట్టి జగన్ విదేశీ టూర్లకువెళ్లారు అని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై అలాగే పార్టీ అధినేత జగన్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ ఇప్పుడు కూడా ఆయన జగన్ పై పలు విమర్శలు చేశారు.

జగన్ ని తిడితే పార్టీలో పదవులు వస్తాయి అని భావిస్తారేమో అలాగే జగన్ పై విమర్శలు చేస్తారు. గతంలో ఆదినారాయణ రెడ్డికి సోమిరెడ్డికి ఇలాగే మంత్రి పదవులు వచ్చాయి అని వైసీపీ విమర్శించేది. అందుకే రాజేంద్రప్రసాద్ కూడా పర్సనల్ అటాక్ గా మాట్లాడుతున్నారు అని వైసీపీ అంటోంది. ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే? జగన్ స్విస్ బ్యాంకులో దాచుకున్న డబ్బుల లెక్కలు చూసుకోవడానికే స్విట్జర్ల్యాండ్ వెళ్లారని బాబు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు… అంతే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేవుడిని కూడా రాజకీయానికి వాడుకుంటోందని, శ్రీవారి బంగారం విషయంలో రాజకీయం చేస్తుందని పేర్కొన్నారు. ఇక రాజేంద్రప్రసాద్ మాటలతో వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చేది లేదు. మరి ఎందుకు ఇంక విమర్శలు మీకు ఏ పదవులు రావు సార్ అని కౌంటర్లు వేస్తున్నారు.