మహేష్-కొరటాల రిలేషన్ అంతగొప్పదా.!

మహేష్-కొరటాల రిలేషన్ అంతగొప్పదా.!

0
53

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత ఎదిగినా అయన తండ్రి కృష్ణ గారి లాగా ఎప్పుడూ ఒదిగే ఉంటారు. ఇక తనతో కలిసి పనిచేసిన వారిని ఎప్పటికీ మర్చిపోని సూపర్ స్టార్, వారి వారి స్పెషల్ అకేషన్స్ ని గుర్తుపెట్టుకుని మరీ విష్ చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ తో కలిసి శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి రెండు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు నేడు కావడంతో అయన తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా శివ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఎంతో టాలెంట్, విజన్ కలిగిన గొప్ప దర్శకుడు మరియు నాకు ప్రియమైన మిత్రుడు కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, ఈ సంవత్సరం మీకు బాగా కలిసివచ్చి మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నట్లు తన పోస్ట్ లో తెలిపారు సూపర్ స్టార్ మహేష్. ఆప్యాయంగా అతన్ని హత్తుకొన్న ఓ ఫొటో ని పోస్ట్ చేశారు. దీనితో మహేష్, కొరటాల మధ్య ఇంత ఎమోషనల్ బాండింగ్ ఉందా అని సినీ జనాలు ఆశ్చర్యపోతున్నారు.