టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారిపాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది, ఇక తర్వాత అమెరికాలో ఓ షెడ్యూల్ షూటింగ్ జరుగనుంది. ఇందులో మహేష్ సరసన కీర్తిసురేష్ నటిస్తోంది, టాలీవుడ్ లో చాలా మంది సీనియర్ నటులు నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా తర్వాత మహేష్ మరో సినిమాకి సంబంధించి స్టోరీలు వింటున్నారు… ఈ కరోనా లాక్ డౌన్ వేళ కథలు వినలేదు మహేష్ బాబు… తాజాగా వింటున్నారట, అయితే టాలీవుడ్ లో ఓ వార్త వినిపిస్తోంది. మరో ప్రాజెక్టుపై కూడా ఫోకస్ చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘ఆకాశం నీ హద్దురా’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది అయితే ఈ సినిమాకి దర్శకత్వం వహించారు దర్శకురాలు సుధ కొంగర.. ఆమె తాజాగా ఓ కథని మహేష్ కి తగ్గట్లు రాశారట, అయితే తాజాగా ఈ సినిమా స్టోరీ కూడా మహేష్ కు వినిపించారు అని తెలుస్తోంది, అయితే మహేష్ ఈ కథని ఒకే చేస్తారా మరో కథని ఒకే చేస్తారా అనేది చూడాలి. సో ఓ చిత్రం పూర్తి అయిన తర్వాత మహేష్ తన తదుపరి చిత్రం చెబుతారు… ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి సర్కారువారి పాట రానుంది.