‘పుష్ప’ సమంత సాంగ్‌కు మేల్‌ వెర్షన్…ఊ అంటావా పాప..ఊఊ అంటావా పాపా పాట వైరల్ (వీడియో)

Male version of 'Pushpa' Samantha song ... Oo Antawa Papa..Ooo Antawa Papa song viral (video)

0
48

సుకుమార్​ దర్శకత్వంలో అల్లుఅర్జున్​ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమానుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్  అవుతుంది సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి. ఈరోజు డిసెంబర్ 17న ఈ మూవీ థియేటర్లలో సందడి చేసింది.

ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించింది. ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని సమంత ప్రత్యేక గీతానికి ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్​ వచ్చింది.

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో ఊ అంటావా..ఊహూ అంటావా మామా సాంగ్ అభిమానులను ఎంత ఊపేస్తోంది. కాంట్రవర్సీలు కూడా అంతే చుట్టుముడుతున్నాయి. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సాంగ్ పెద్ద సెన్సేషన్‌గా మారింది. అందులో లిరిక్స్ కూడా కాంట్రవర్సీ అవుతున్నాయి. ఇప్పటికే ఫిమేల్ వాయిస్ తో వచ్చిన ఈ పాట రికార్డ్స్ ను సృష్టిస్తుంది.

ఫిమేల్ వాయిస్ పాట

https://www.youtube.com/watch?v=u6BoyOceiPE&feature=emb_title

ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఊ అంటావా మామ పాటకు పేరడీలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు మేల్ వాయిస్ తో వచ్చిన ఊ అంటావా పాప ఊఊ అంటావా పాప పాట ట్రెండింగ్ గా మారింది.

మేల్ వాయిస్ పాట

https://www.youtube.com/watch?time_continue=50&v=Tks68B-RNXM&feature=emb_title