మన దేశంలో చలన చిత్ర పరిశ్రమలో సౌత్ ఇండియాలో కంటే ఇటు బాలీవుడ్ లో నటులకి భారీ పారితోషికం ఉంటుంది, అయితే చాలా స్టేట్స్ లో హింది సీనిమాలు విడుదల ఉంటుంది కాబట్టి ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి..ఇక మన సౌత్ యాక్టర్స్ లో కొంతమంది హిందీ టాప్ యాక్టర్ల కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ యాక్టర్ల సంపాదనను కలిపి చూస్తే మీకే తెలుస్తుంది.
గత ఏడాది మన టాప్ 9 సౌత్ సూపర్ స్టార్స్ సంపాదన ఎలా ఉందో చూద్దాం.
1. రజనీకాంత్
ఆయన 2019లో రూ. 100 కోట్లు ఆర్జించారు.ఫోర్బ్స్ సెలబ్రిటీ లిస్ట్లో ఆయనది 13వ స్థానం.
2. మోహన్ లాల్
ఆయన 2019లో సంపాదించింది రూ. 64.5 కోట్లు. ఈఏడాది ఆయన నటించిన ఐదు సినిమాలు విడుదల అయ్యాయి
3. అజిత్కుమార్
2019లో విశ్వాసమ్- నేర్కొండ పార్వై సినిమాలతో ఘన విజయాలు అందుకున్న అజిత్ రూ. 40.5 కోట్లు సంపాదించారు
4. మహేశ్ బాబు
మహర్షి- సరిలేరు నీకెవ్వరు సినిమాల ద్వారా ఎక్కువగా ఆర్జించారు. రూ. 35 కోట్ల సంపాదనతో టాలీవుడ్లో ఆయనదే ప్రథమ స్థానం.
5. ప్రభాస్
2019లో ఆయన ఆదాయం రూ. 34 కోట్లు.
6. కమల్ హాసన్
ఆయన రూ. 34 కోట్లు ఆర్జించారు. ఇందులో అధిక భాగం బిగ్ బాస్ షో ద్వారా వచ్చిందే.
7. మమ్ముట్టి
ఆయన 2019లో ఏకంగా ఏడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీటి ద్వారా ఆయనకు రూ. 33.5 కోట్ల ఆదాయం వచ్చింది.
8. ధనుష్
రూ. 31.75 కోట్లను 2019లో సంపాదించాడు ధనుష్.
9. విజయ్
2019లో విజయ్ సంపాదన రూ. 30 కోట్లు.