Manchu Manoj | తండ్రి అయిన మంచు మనోజ్.. పండంటి పాపకు జన్మనిచ్చిన మౌనిక..

-

తెలుగు హీరో మంచు మనోజ్(Manchu Manoj) తండ్రి అయ్యాడు. ఆయన భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మనోజ్ సోదరి మంచు లక్ష్మీ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. “మనోజ్– మౌనిక మరోసారి తల్లితండ్రులయ్యారు. మా ఇంట్లోకి దేవత వచ్చింది. మనోజ్ దంపతులు పాపకి జన్మనిచ్చారు. అన్నగా ధైరవ్ సంతోషిస్తున్నాడు. అప్పుడే తనకి MM పులి అనే నిక్ నేమ్ కూడా పెట్టాము. శివుడి ఆశీస్సులు ఈ ఫ్యామిలీపై ఉండాలని కోరుకుంటున్నాను” పోస్ట్ చేసింది. దీంతో మంచు లక్ష్మి పోస్ట్ వైరల్‌గా మారడంతో మనోజ్ దంపతులకు అభిమానులు, నెటిజన్, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

- Advertisement -

కాగా మంచు మనోజ్ ఇటీవల దివంగత మంత్రి భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే మౌనికకు ధైరవ్ అనే బాబు ఉన్నాడు. మనోజ్‌ కూడా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం ఇద్దరు ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో ఓ ఇంటి వారయ్యారు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్(Manchu Manoj).. త్వరలోనే వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించాడు.

Read Also: మోసానికే జగన్ బ్రాండ్ అంబాసిడర్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...