మ‌రో ద‌ర్శ‌కుడికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్

మ‌రో ద‌ర్శ‌కుడికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్

0
84

ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్, మ‌ళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు, ఇక తాజాగా ఆయ‌న వ‌కీల్ సాబ్ చిత్రం చేస్తున్నారు, కాని ఈ వైర‌స్ తో లాక్ డౌన్ వ‌ల్ల షూటింగ్ కు బ్రేకులు ఇచ్చారు, అయితే ఆయ‌న మ‌రో రెండు సినిమాల‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు, ద‌ర్శ‌కుడు క్రిష్ తో ఓ సినిమా హ‌రీష్ శంక‌ర్ తో మ‌రో సినిమా చేయ‌నున్నారు.

ఇక ఈ ఏడాది ప‌వ‌న్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉండ‌నున్నారు.ఈ నేపథ్యంలో దర్శకుడు కిషోర్ కుమార్ పార్ధసాని ఒక కథను పవన్ కి వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి అని తెలుస్తోంది. గ‌‌తంలో ప‌వ‌న్ తో ఆయ‌న రెండు సినిమాలు చేశారు. మంచి హిట్ అయ్యాయి, దీంతో ఆయ‌న‌కు మ‌రో ఛాన్స్ ఇస్తున్నారు అని తెలుస్తోంది.

ప‌వ‌న్ కు మంచి సూప‌ర్ మైలేజ్ తెచ్చె క‌ధ‌ని ఆయ‌న రాశార‌ట‌.గోపాల గోపాల- కాటమరాయుడు సినిమాలను తెరకెక్కించిన ఆయ‌న, ఇప్పుడు మ‌రో సినిమాకి ఛాన్స్ తీసుకుంటే ఇది మూడో సినిమా అవుతుంది, మొత్తానికి దీని గురించి ఇంకా క‌న్ఫామ్ అయిన‌ట్లు వార్త రావాల్సి ఉంది.