ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోయిన్ వివాహం చేసుకుంటున్నారు. మూడు ముళ్ల బంధంతో ఒకటి అవుతున్నారు . కొందరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మరికొందరు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటున్నారు.తాజాగా అందాల తార ప్రణీత సుభాష్ పెళ్లి చేసుకుంది.
నితిన్ రాజు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది ప్రణీత. అతి తక్కువ మంది సమక్షంలో కుటుంబ సభ్యులు ఫ్రెండ్ మధ్య ఈ వివాహం జరిగింది, ఇక బెంగళూరులో వీరి వివాహం జరిగింది. తన పెళ్లి లవ్-అరేంజ్డ్ అని చెప్పుకొచ్చింది. ఇక వారిద్దరు కొద్ది సంవత్సరాలుగా మంచి స్నేహితులు అలా స్నేహం నుంచి పెళ్లి వరకూ వెళ్లారు.
ఇక ఆమె భర్త నితిన్ రాజుకి పలు వ్యాపారాలు ఉన్నాయి. బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త అని తెలుస్తోంది, ఇక ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకోవడంతో ఏడు అడుగులు వేశారు. ఇక తెలుగులో ఆమె అనేక సినిమాల్లో హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే. బావ, రభస, అత్తారింటికి దారేది ఈ సినిమాలు ఎంతో పేరు తెచ్చాయి ప్రణీతకు.