పునీత్ రాజ్​కుమార్​ సమాధి ఎదుట పెళ్లి..చివరకు..

Married in front of Puneet Rajkumar's tomb..finally ..

0
92

కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ ఇక లేరనే విషయాన్ని ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. రోజూ అనేక మంది వచ్చి పునీత్ సమాధిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో పునీత్​పై అభిమానం ఉన్న ఓ ప్రేమజంట ఆయన సమాధి ముందే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. వాళ్లిద్దరూ రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ పునీత్ రాజ్​కుమార్​కు వీరాభిమానులు. పెళ్లి చేసుకుందామని వారు శనివారం కంఠీవ స్టేడియానికి వచ్చారు.

అయితే పునీత్ సమాధి ముందు వివాహం చేసుకోవటానికి అక్కడి పోలీసులు అంగీకరించలేదు. దీంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. మాకు కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ అంటే చాలా ఇష్టం. మేము వివాహం చేసుకునేందుకు మా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అంగీకరించారు. కానీ ఇక్కడ వివాహం చేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని వారు నిరాశకు లోనయ్యారు.

చేసిన 29 సినిమాలతోనే అప్పుగా అశేష కన్నడ ప్రేక్షకాదరణ సంపాదించారు పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. జీవించింది కేవలం 46 ఏళ్లే అయినప్పటికీ ప్రజల గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించారు. యాక్టర్, ప్లే బ్యాక్ సింగర్…టెలివిజన్ ప్రెజంటర్,  ప్రొడ్యూసర్‌గా సినిమా ఫీల్డ్‌లో తన మార్క్ చూపించారు. ఇవన్నీ నాణేనికి ఓవైపు మాత్రమే. ఇవే కాదు. పునీత్ రాజ్ కుమార్ అంటే 45 ఉచిత పాఠశాలలు, 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు. అవును అందుకే కంఠీరవకు జనం పోటెత్తారు. తమ గుండెల్లో ఉన్న అప్పు ఆఖరి చూపు కోసం ఆరాటపడ్డారు.