మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన నభా నటేష్

మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన నభా నటేష్

0
87

కొందరు హీరోయిన్లకు తొలి సినిమా హిట్ అవ్వకపోయినా పేరు తీసుకురాకపోయినా, మలి సినిమాలు మాత్రం మంచి ఫేమ్ తీసుకువస్తాయి. తాజాగా ఇది నభా నటేష్ను చూస్తుంటే అవును అనిపిస్తుంది. నన్ను దోచుకుందువటే అంటూ వచ్చినా కూడా ప్రేక్షకుల మనసు దోచుకోలేకపోయింది ఈ భామ. తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయేలా చేసింది.

ఇక ఆమె ఇంటి ముందు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.. అంతేకాదు రవితేజ హీరోగా నటిస్తున్న డిస్కోరాజా చిత్రంలో మెయిన్ హీరోయిన్గా నటిస్తుంది నభా. ఇక ఈ చిత్రం 25 డిసెంబర్ న విడుదల కానుంది. ఇక మరో చిత్రాన్ని కూడా ఆమె ఫైనల్ చేసింది అని వార్తలు వస్తున్నాయి.

సాయి ధరమ్ తేజ్తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుంది నభా. కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న సోలో బ్రతుకే సో బెటరూ సినిమాలో సాయికి జోడీగా నటిస్తుంది నభా,.. సో వరుసగా మరో అవకాశం కూడాా ఆమె తలుపుతట్టిందట, ఒక్క సినిమాతో నభా ఫేమ్ మారిపోయింది అంటున్నారు టాలీవుడ్ అనలిస్టులు.