ఏపీ తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీ తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

0
31

ఏ కాలానికి ఆ గొడుగు పట్టాలి అంటారు ఇప్పుడు అలాంటి పరిస్దితి వచ్చింది వేసవి వస్తే ఆ ఎండ తట్టుకోలేము, వర్షా కాలంలో వర్షాలు ముంచెత్తుతాయి. నాలాలు పొంగిపొర్లుతాయి. ఇక శీతాకాలం వచ్చింది అంటే చలికి గడ్డకడతాం, అంతేనా శరీరంలో ఉన్న కొత్త రకాల వ్యాధులు బయటకు వస్తాయి. ఊపిరితిత్తులు సమస్యలతో పాటు, ఆస్మా పేషెంట్లకు మరీ దారుణమైన పరిస్దితి ఉంటుంది.

తాజాగా ఏపీ తెలంగాణ తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ ఓ ముఖ్యమైన హెచ్చరిక చేస్తోంది. ఈ ఏడాది చలి తీవ్రత కొంతమేర ఎక్కువగా ఉంటుందని, వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు వారం రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగిపోయింది.

అంతేకాదు పగటి పూట ఎండ ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు. అలాగే డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి 15 వరకు చలి తీవ్రత అత్యంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల వారికి చలితీవ్రత మరింత ఎక్కువ ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు.