మెగా హీరో వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా స్టార్ట్ అయింది – దర్శకుడు ఎవరంటే

మెగా హీరో వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా స్టార్ట్ అయింది - దర్శకుడు ఎవరంటే

0
103

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు… డెబ్యూ మూవీ అతనికి మంచి ఫేమ్ తీసుకువచ్చింది… ఎంతో హిట్ అయింది… ఈ చిత్రం దేశంలోనే సరికొత్త రికార్ట్ క్రియేట్ చేసింది…ఈ క్రేజ్ తో వైష్ణవ్ తేజ్ ను వెతుక్కుంటూ కొత్త ప్రాజెక్టులు చాలానే వచ్చాయి… కాని తనకి సెట్ అయిన బాగా నచ్చిన కథలని ఆయన ఒకే చేస్తున్నారు.

 

 

 

దాదాపు నాలుగు ఐదు ప్రాజెక్టుల కథలు ఆయన విన్నారు అని టాలీవుడ్ టాక్… అయితే తాజాగా నేడు ఓ సినిమా స్టార్ట్ అయింది….హీరో వైష్ణవ్ తేజ్ హీరోయిన్ కేతిక శర్మపై సాయిధరమ్ తేజ్ క్లాప్ ఇచ్చారు . వైష్ణవ్ తేజ్ తల్లి విజయదుర్గ కెమెరా స్విచ్చాన్ చేశారు, నేడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది, బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా వస్తోంది.

 

ఈ చిత్రానికి గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు . తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ఆదిత్య వర్మ చిత్రం తీశారు గిరీశాయ.. మొత్తానికి డిఫరెంట్ స్టోరీతో వైష్ణవ్ మన ముందుకు వస్తున్నారు, మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ చెబుతున్నారు.