ఈ యాప్ మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేయద్దు – ఉంటే ఇక అంతే జాగ్రత్త

ఈ యాప్ మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేయద్దు - ఉంటే ఇక అంతే జాగ్రత్త

0
67

మీ ఫోన్లో అవసరం లేని యాప్ లు మాత్రం అస్సలు ఉంచకండి… తెలియని యాప్స్ సెక్యూరిటీ లేని యాప్స్ ఎలాంటి పరిస్దితిలో వాడవద్దు అంటున్నారు నిపుణులు… ఆండ్రాయిడ్ ఫోన్లలో సిస్టమ్ అప్ డేట్ అనే ఫీచర్ ఉంటుంది అనే విషయం తెలిసిందే, దీనిని అప్ డేట్ చేసుకుంటాం… అయితే హ్యాకర్లు దీనిని అదునుగా చేసుకుని మనల్ని బోల్తా కొట్టిస్తున్నారు.

 

హ్యాకర్లు సిస్టమ్ అప్ డేట్ అనే పేరుతో ఓ మాల్వేర్ యాప్ కు రూపకల్పన చేశారు… ఒక్కసారి ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే యూజర్లు తమ ఫోన్లపై నియంత్రణ కోల్పోతారని జింపీరియం అనే సైబర్ భద్రత సంస్థ వెల్లడించింది… సో ఇలాంటి మాల్వేర్ యాప్ తో జాగ్రత్తగా ఉండాలి.

 

ఈ మాల్వేర్ ఒక్కసారి ఫోన్ లోకి ఎంటరయితే ఎక్కడ్నించైనా మీ ఫోన్ ను హ్యాకర్లు తమ నియంత్రణలోకి తెచ్చుకోగలరు.. వారికి

ఆఛాన్స్ ఇవ్వద్దు అంటున్నారు. ఇక మీరు ఓఎస్ కు సంబంధించిన అప్ డేట్స్ ను కేవలం ఫోన్ లోని అప్ డేట్స్ సెక్షన్ లోనే చేసుకోవాలి. దీనికి ఎలాంటి యాప్స్ ఉండవు అనేది గుర్తుఉంచుకోండి.