మెగా హీరోలంటే ఎవరో నాకు తెలీదు.. ఇప్పటివరకు అలాంటి పేర్లే వినలేదు

మెగా హీరోలంటే ఎవరో నాకు తెలీదు.. ఇప్పటివరకు అలాంటి పేర్లే వినలేదు - జయసుధ సంచలన వ్యాఖ్యలు..!!

0
155

తెలుగునాట సీనియర్ హీరోయిన్ లలో మంచి పేరున్న నటి జయసుధ.. సహజ నటిగా గుర్తింపు పొందిన జయసుధ ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమాల్లో హీరోలకు అమ్మ పాత్రల్లో నటిస్తూ హీరోయిన్ గా కంటే ఇప్పుడు ఎక్కువ సినిమాల్తో బిజీ గా ఉంది.. కుటుంబ కథ చిత్రాలేవీ వచ్చినా సరే ఆ సినిమా లో తప్పకుండా కనిపించే నటి జయసుధ.. ఇండస్ట్రీ లో ని అందరి హీరోలతో నటించిన అనుభవం ఆమె కు ఉన్నా ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో మెగా హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది..

మహేష్ తో నటించడం ఎలా ఉంది అన్న ప్రశ్నకు జయసుధ మహేష్తో నటించడం చాల గొప్పగా ఉంది.. ” విజయనిర్మల గారికి నేను బంధువును కావడం వల్లన కృష్ణగారి కుటుంబసభ్యులతో నాకు మంచి అనుబంధం వుంది. మహేశ్ బాబును బాల నటుడి నుంచి చూస్తున్నాను. ఆయనతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ .. ‘బ్రహ్మోత్సవం’ చేశాను. ‘మహర్షి’లో ప్రకాశ్ రాజ్ భార్యగా కనిపిస్తాను. ఈ సినిమాను దర్శకుడు చాలా గొప్పగా తెరకెక్కించాడు. మహేశ్ బాబు చాలా బాగా చేశాడు. రెండు సీన్లలో ఆయన నటన చూస్తూ .. నా పాత్ర వైపు నుంచి ఇవ్వాల్సిన రియాక్షన్స్ ఇవ్వకుండా వుండిపోయాను. ఆ సీన్లలో నిజంగానే మహేశ్ బాబు నాకు కన్నీళ్లు తెప్పించాడు. ఆయన నటనకి అవార్డు రావడం ఖాయమని అనిపిస్తోంది” అని చెప్పుకొచ్చారు.

అయితే ఇదే సమయంలో యాంకర్ మెగా హీరోలతో పనిచేసిన అనుభవం ఎలా ఉంది అన్న ప్రశ్నకు ఆమెకు మెగా అభిమానులకు కోపం వచ్చేలా మాట్లాడారు.. మెగా హీరోలంటే ఎవరు.. మెగా ఫామిలీ హీరో లంటే ఎవరున్నారు అనే ధోరణి లో ఆమె మాట్లాడారు.. అస్సలు ఆమె ఆ పదమే వినలేదన్నట్లు మాట్లాడారు.. అసలు ఇండస్ట్రీ లో అలాంటి హీరోలు లేరని తాను చుసిన హేమా హేమీలు ఎన్టీఆర్ , నాగేశ్వరావు గారు అన్నట్లు చిరంజీవి ని అవమానించినట్లు మాట్లాడారు.. మీడియా కి, ప్రజలకు, అభిమానులకు మెగా హీరోలే తప్పితే మాకు మాత్రం జస్ట్ నటులు అంతే అన్నారు.. వైసీపీ లో చేరి ఆ పార్టీ తరపున కొమ్ము కాస్తున్న జయసుధ ఈ వ్యాఖ్యలతో ఎలాంటి ముప్పు తెచ్చుకుంటుందో మరీ..