మంగళగిరి లో సీన్ మారింది ఆర్కేకు ఎదురుదెబ్బ

మంగళగిరి లో సీన్ మారింది ఆర్కేకు ఎదురుదెబ్బ

0
57

ముఖ్యంగా మంత్రి నారాలోకేష్ రాజధాని ప్రాంతంలో తన స్ధానం నిరూపించుకోవాలి అని అనుకున్నారు రాజకీయంగా.. ఇది చాలా టఫ్ అయిన స్ధానం.. ఇక్కడ బీసీ ఓటు బ్యాంకు ఎక్కువ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా బీసీ ఫాలోయింగ్ ఉంది. బీసీ ఓట్లు అన్నీ మనకే అని అక్కడ నుంచి బరిలోకి దిగారు.. మరో పక్క సీఎం కొడుకు పోటీ చేస్తున్నారు కాబట్టి వైసీపీ కూడా ఆర్కేని బరిలోకి దించింది. అయితే ఇద్దరి మధ్య టఫ్ వార్ కొనసాగింది.. ప్రచారం నుంచి ఇటు పోలింగ్ వరకూ మంగళగిరి పేరు మార్మోగిపోయింది. కాని పోలింగ్ తర్వాత ఎలాంటి ఫలితాలు వచ్చాయి అని ఇటు ఇరు పార్టీలు సర్వేల ద్వారా తెలుసుకున్నాయి.

అయితే పోలింగ్ కు ముందు అంతా ఇక్కడ ఆర్కేకి గెలుపు వస్తుంది అని భావించారు, కాని పోలింగ్ తర్వాత సీన్ మారిపోయింది .ఇక్కడ ఇప్పుడు మూడు నుంచి 4 వేల ఓట్ల మెజార్టీతో నారాలోకేష్ గెలుపొందడం పక్కా అని తెలుస్తోంది.. అయితే వైసీపీ కూడా ఇక్కడ ధన ప్రవాహం చూపించింది. అలాగే టీడీపీ పై విమర్శలు వచ్చినా, ఇక్కడ ప్రజలకు సంక్షేమ పథకాలు పసుపు కుంకుమ ఇవన్నీ పార్టీకి ప్లస్ అవుతాయి అని తెలుసుకున్నారు. అంతేకాదు రాజధాని ప్రాంతంలో కాబోయే సీఎం ఎమ్మెల్యే అభ్యర్దిగా గెలిస్తే ఇది మరో కుప్పం తరహాలో అభివృద్ది జరుగుతుంది అని, సీఎంని అందించిన ఊరు అవుతుంది అని ఇక్కడ జనం కూడా భావించారట.