‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్​..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

'RRR' Promotions..Mega Power Star Ram Charan Interesting Comments

0
102

2013లో ‘జంజీర్’తో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. ఆ తర్వాత అక్కడ సినిమాలు చేయలేదు. అయితే హిందీలో మళ్లీ ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్​లో భాగంగా దీనితో పాటు పలు విషయాల్ని వెల్లడించారు.

“నేను చూసిన దాని ప్రకారం నటులు దర్శకులను కాదు.. దర్శకులే నటులను ఎంపిక చేయాలి.’పద సినిమా చేద్దాం’ అని ఏ డైరెక్టర్​కు చెప్పలేను. అది వర్కౌట్​ కూడా కాదు. డైరెక్టర్లు స్వయంగా కథ సిద్ధం చేసి, అందులోని పాత్రకు నేను సరిపోతాను అనిపించి నటిస్తేనే బాగుంటుంది” అని చరణ్ అన్నారు.

అయితే నటులు అడిగారు కదా అని దర్శకులు కథ రాసి, సినిమా తీస్తే మాత్రం రిజల్ట్ అల్లకల్లోలం అయిపోతుందని చరణ్ చెప్పారు. ప్రస్తుత సోషల్ మీడియా, ఓటీటీ యుగంలో నటుల ప్రతిభను దర్శకులు గుర్తిస్తున్నారని, అందుకు తగ్గ స్టోరీలు రాసుకొస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో ప్రతిదీ పాన్ ఇండియా అయిపోయిందని, ‘బాహుబలి’ ఫ్రాంచైజీతో దీనికి నాంది పలికిన రాజమౌళికి ఈ ఘనత దక్కుతుందని చరణ్ ప్రశంసించారు.