మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేశ్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళాశంకర్(Bhola Shankar)’. ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి మేడే(May Day) సందర్భంగా చిరంజీవి మింటేజ్ మాస్ లుక్‌లో కనిపించే మూడు పోస్టర్లు విడుదల చేశారు. గ్రే కలర్ యూనిఫామ్‌లో టాక్సీ డ్రైవర్‌గా చిరంజీవి యంగ్ అండ్ డైనమిక్‌గా కనిపిస్తున్నారు. ‘మా సినిమా తదుపరి షెడ్యూల్ కోల్‌కతాలో జరుగుతుంది. ఆ తర్వాత చిరంజీవి(Chiranjeevi), తమన్నా(Tamanna)లపై ఓ పాటను యూరప్‌లో చిత్రీకరించనున్నాం. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్, భారీ సెట్ సాంగ్ చిత్రీకరిస్తాం. దీంతో జూన్ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది’ అని చెప్పారు నిర్మాత రామబ్రహ్మం సుంకర. ఆగస్టు 11న ఈ సినిమా(Bhola Shankar) ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.