తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రానికి సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు… ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తి అయిన నేపథ్యంలో కారోనా కారణంగా షూటింగ్ లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే… అయితే ఇటీవలే షరతులతో కూడిన పర్మీషన్స్ ఇచ్చారు దీంతో షూటింగ్ లు స్టార్ అయ్యారు…

తాజాగా చిరంజీవి చిత్రానికి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది… ఈ చిత్రంలో ఐటం సాంగ్ ఎవరితో చిత్రీకరిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతంది… ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఐటం పాటకు తమన్నా పేరు వినిపిస్తోంది… మెగాస్టార్ చిరంజీవి పక్కన డాన్స్ చేయడానికి తమన్నా బాగుంటుందన్న ఉద్దేశంతో ఆమెను డైరెక్టర్ కొరటాల శివ సంప్రదిస్తున్నట్లు టాలీవుడ్ టాక్…

కాగా తమన్నా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఐటం సాంగ్ లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పింది… ఎందుకుంటే ఐటం సాంగ్ లో డాన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అందుకే తాను ఐటం సాంగ్ లో నటించేందుకు ఇష్టపడతానని చెప్పింది..