ఒకే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ..వీడియో వైరల్

0
130

మాస్ మహారాజ్ రవితేజ దూకుడు పెంచారు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే క్రాక్ తో హిట్ కొట్టిన హీరో ఖిలాడీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇక తాజాగా రవితేజ నటిస్తున్న మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’

ఇదే కాక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు, అటు మాస్ మహారాజ్ రవితేజ అభిమానులకు డైరెక్టర్ బాబీ అదిరిపోయే న్యూస్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో రవితేజ గెస్ట్ రోల్ చేయనున్నాడు. ఈ మేరకు అధికారికంగా ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్.

రవితేజను మెగాస్టార్​ తన కారవాన్​లోకి లాగేసినట్లు ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ’ద మాస్ ఫోర్స్ జాయిన్స్ ద మెగా స్టార్మ్ ‘ అనే క్యాప్షన్ తో ఈ టీజర్ ని విడుదల చేశారు.

https://www.youtube.com/watch?v=Dkmz2pXGgQs&feature=emb_title