మెగాస్టార్ చిరు ‘గాడ్ ఫాదర్’ మూవీ సెన్సార్ కంప్లీట్..ఆసక్తికర పోస్టర్ రిలీజ్

0
102

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఆచార్య ఇచ్చిన గుణపాఠంతో కథల ఎంపికలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే గాడ్ ఫాదర్ నుండి ‘థార్ మార్’ సాంగ్ విడుదలై విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ పాటలో సల్మాన్, చిరు స్టెప్పులు ప్రేక్షకుల చేత ఈలలు వేయించాయి.ఈ సాంగ్ అభిమానులకు ఫుల్ ట్రీట్ గా చెప్పవచ్చు. ఇక ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుంది. దీనితో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. కాగా ఈ సినిమా రాజకీయ నేపథ్యంగా తెరకెక్కుతుంది. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. కాగా ఈ సినిమా లూసిఫర్ కు రీమేక్ గా మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు.