Video: ఆకాశంలో గాడ్ ఫాదర్ ప్రమోషన్స్..మెగాస్టార్ చిరంజీవితో శ్రీముఖి ఇంటర్వ్యూ

0
39

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళంలో తెరకెక్కిన లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్. మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంగా సాగనుంది.పాలిటిక్స్ లో ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. లేదంటే ఎదుటివారి చేతుల్లో ఓడిపోవాల్సి వస్తుంది. అయితే గాడ్ ఫాదర్ కు మాత్రం రాజకీయం చాలా తేలిక. ఇదే పాయింట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది.

నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. నా నుండి రాజకీయం ఇంకా దూరం కాలేదంటూ మెగాస్టార్ ఓ ఆడియో బైట్ ను ఇటీవల వదిలారు. అది నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ డైలాగ్ గాడ్ ఫాదర్ మూవిలోదనే తెలుస్తుంది. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేశారు చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమా నుండి తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ రిలీజై ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమా ప్రోమోషన్లను డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ప్రమోషన్స్ ఇన్ క్లౌడ్స్ అంటూ ప్రోమోను వదిలారు. మెగాస్టార్ చిరంజీవిని యాంకర్ శ్రీముఖి ఇంటర్వ్యూ చేస్తూ చాలా ప్రశ్నలు అడిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://youtu.be/hB-uH188J8w

https://youtu.be/lclXExOvjoU