జార్జియా లో యాక్షన్ సీన్స్ లో మెగాస్టార్

జార్జియా లో యాక్షన్ సీన్స్ లో మెగాస్టార్

0
127

మెగాస్టార్ చిరంజీవి తాజాగా న‌టిస్తోన్న సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి`. ఈ సినిమాలో ఆంగ్లేయుల‌కు ఎదురుతిరిగిన తొలి పాలెగాడు న‌ర‌సింహారెడ్డి. ఆయన గురువు పాత్ర‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా జార్జియాలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి స‌హా జ‌గ‌ప‌తిబాబు, నిహారిక మెయిన్ క్రూ అంతా జార్జియా చేరుకున్నారు. ఇప్పుడు చిరంజీవి జార్జియాకు ప‌య‌న‌మైయ్యారు. మ‌ధ్య‌లో రామ్‌చ‌ర‌ణ్‌తో అజ‌ర్‌బైజాన్‌లో కొన్ని రోజులు గ‌డిపిన చిరు ఈ షెడ్యూల్‌లో యాక్ష‌న్ సీన్స్‌లో న‌టించ‌డానికి సిద్ధ‌మైపోయారు. రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.