బాల‌య్య సినిమాలో మెహ్రీన్- క్లారిటీ ఇచ్చిన అందాల తార‌

Mehreen in a Balakrishna movie-Beauty star given Clarity

0
102

టాలీవుడ్ లో నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది నటి మెహ్రీన్ పిర్జాదా. ఇక తర్వాత ఆమెకి తెలుగులో పలు అవకాశాలు వచ్చాయి. మెహ్రీన్ పిర్జాదా కుర్రాళ్ల కలల రాకుమారిగా మారింది. ప్రస్తుతం ఎఫ్3 సినిమాలో నటిస్తుంది మెహ్రీన్ పిర్జాదా. ఇక తాజాగా ఆమెకి ఓ సినిమాలో అవకాశం వచ్చింది అని వార్తలు వినిపించాయి.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ సినిమా కోసం హీరోయిన్ గా మెహ్రీన్ పిర్జాదాని సంప్రదించారని వార్త వినిపించింది. బాలయ్య, గోపిచంద్ చిత్రం ఇది. బాలయ్యకు జోడీగా మెహ్రీన్ అంటూ వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. తాను ఈ సినిమాలో నటించడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది.

ఇక మెహ్రీన్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా చేస్తోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో కూడా వర్క్ చేస్తోంది. మొత్తానికి బాలయ్య సినిమాలో మరి హీరోయిన్ ఎవరా అని టాక్స్ అయితే నడుస్తున్నాయి.