మోనాల్ కి షాకిచ్చిన అఖిల్ – బిగ్ బాస్ సీజన్లో సంచలనం

మోనాల్ కి షాకిచ్చిన అఖిల్ - బిగ్ బాస్ సీజన్లో సంచలనం

0
105

బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ ఊహించనివి జరుగుతున్నాయి.. నామినేషన్స్ విషయానికి వస్తే అఖిల్ మోనాల్ ఏ నాడు నామినేట్ చేసుకోరు అని అందరూ అనుకున్నారు, కాని సీన్ మారింది. సీజన్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే అందరికంటే ముందు అఖిల్, మోనాల్ పేర్లు చెబుతాం, మరి ఇద్దరూ అంత క్లోజ్ గా ఉన్నారు.

మరి అఖిల్ కు మోనాల్ అంటే ఇష్టం అని అందరూ అనుకుంటన్నారు, నిజంగా మోనాల్ హౌస్ నుంచి బయటకు వెళితే అసలు ఏమౌపోతాడో అనిపించేలా కొన్ని సార్లు హౌస్ లో చూశాం,అఖిల్. ఈ వారం ఏకంగా ఆమెను నామినేట్ చేసి సంచలనం సృష్టించాడు. అంతేకాదు ఏకంగా ఇంటి సభ్యులు కూడా షాక్ అయ్యారు.

ఇదేంటి మోనాల్ ని నామినేట్ చేశాడు అని షాక్ అయ్యారు అందరూ,మాస్టర్ అమ్మా రాజశేఖర్ కూడా ఇదే అన్నారు. ఇక మోనాల్ ను తమ టీంలో జాయిన్ చేసుకున్నారు అమ్మా రాజశేఖర్ .. అవినాష్, అమ్మ రాజశేఖర్, అరియానా ఇప్పుడు ఓటీమ్ గా మారిపోయారు అంటున్నారు అందరూ.