మరింత ఎనర్జిటిక్‌గా నాగార్జున..బిగ్‌బాస్ కర్టెన్‌ రైజర్‌ ప్రోమో చూశారా? (వీడియో)

0
112

బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిన విషయమే. ఎంతోమంది సెలబ్రిటీలను 90 రోజుల పాటు బయట ప్రపంచానికి దూరంగా బిగ్ బాస్ ఇంట్లో ఉంచి టాస్క్ లతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు. ఇక తాజాగా Biggboss-6 సీజన్ ఇవాళ గ్రాండ్ గా స్టార్ట్ కానుంది.ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ 6 సీజన్ కి హోస్టుగా నాగార్జున చేయబోతున్నారు.

ఈ సీజన్లో ఈసారి 17 మందిని ఫైనల్ చేశారట బిగ్ బాస్. అందులో 15 మందిని ఒకేసారి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనుండగా మిగతా ఇద్దరి కంటెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశ పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో షో పై మరింత బజ్‌ పెంచేందుకు తాజాగా ఓ కర్టెన్‌ రైజర్‌ ప్రోమోను విడుదల చేసింది బిగ్‌బాస్ యాజమాన్యం. ఎప్పటిలాగే ఈ ప్రోమోలో కింగ్ మరింత ఎనర్జిటిక్‌గా కనిపించారు. రెట్టింపు ఉత్సాహంతో కంటెస్టెంట్స్ హౌస్‌లోకి స్వాగతం పలికారు.

ఇక ఈ సీజన్‌లో కంటెస్టెంట్ల వివరాలను రివీల్‌ చేయలేదు గానీ కొందరు హౌస్‌మేట్స్‌ వాయిస్ లని మాత్రం ప్రోమోలో వినిపించారు. రెగ్యులర్‌గా వినిపించే వాయిస్‌లని బట్టి కొందరు కంటెస్టెంట్లను నెటిజన్లు, ప్రేక్షకులు ఈజీగా గుర్తు పట్టేశారు. ముఖ్యంగా సింగర్ రేవంత్, జబర్దస్త్ చంటి గొంతను ఈజీగా ఐడింటిఫై చేయొచ్చు. ఇక షోలో పాల్గొంటున్న ఫీమేల్ కంటెస్టెంట్లలో కూడా కొంత మంది వాయిస్ రివీల్ అయ్యింది.

బిగ్ బాస్ కర్టెన్‌ రైజర్‌ ప్రోమో వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=GWDYRlVDwkQ&feature=emb_title