చిత్రం : దేవదాస్
నటీనటులు: అక్కినేని నాగార్జున – నాని – రష్మిక మందన్నా – ఆకాంక్ష – శరత్ కుమార్ – కునాల్ కపూర్ – మురళీ శర్మ – వెన్నెల కిషోర్ – నవీన్ చంద్ర – అవసరాల శ్రీనివాస్ – నరేష్ – సత్య కృష్ణ – రావు రమేష్ – సత్య – బాలసుబ్రమణ్యం తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: శ్యామ్ దత్
రచన: భూపతి రాజా – సత్యానంద్
నిర్మాత: అశ్వినీదత్
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
కథ :
డాక్టర్ వృత్తిలో దాసు (నాని) చాల సరదాగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అనుకోకుండా అతని జీవితంలోకి వస్తాడు డాన్ దేవా (నాగార్జున). దేవా తన శత్రువులైన దాదా (శరత్ కుమార్) అతని కొడుకు నవీన్ చంద్రతో పాటుగా డేవిడ్ (కునాల్ కపూర్) నుంచి తప్పిచుకునే క్రమంలో దాసు జీవితలోకి వస్తాడు దేవా. కానీ దాసు అప్పటికే పూజా (రష్మిక)తో లవ్ ప్రాబ్లెం లో ఉంటాడు. దేవా కూడా జాహ్నవి (ఆకాంక్ష సింగ్) లవ్ లో పడతాడు. అయితే ఈ సినిమాలో వారి ప్రేమలను ఎలా దక్కించుకున్నారు, అదేవిధంగా తన శత్రువులను దేవా ఎలా ఎదుర్కున్నాడు అనేది తెలుసుకోవాలంటే బిగ్ స్క్రీన్ పై చూడాలసిందే. నటీనటుల ప్రతిభ : నాగార్జున , నాని ల మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయని చెప్పవచ్చు. నాగార్జున క్రేజీ లుక్ తో మరియు నాని నాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఇక హీరోయిన్స్ రష్మిక, ఆకాంక్ష సింగ్ ఇద్దరు చాలా బాగా నటించారు. ఈ సినిమాలో వెన్నల కిషోర్ కామెడీ బాగుంది. శరత్ కుమార్, కునాల్ కపూర్, నవీన్ చంద్ర మరియు ఇతర నటి నటులు కూడా తమ పరిధిమేరకు నటించారు.
ప్లస్ పాయింట్లు
ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్
మ్యూజిక్
కెమెరా
లొకేషన్స్, కాస్ట్యూమ్స్
మైనస్ పాయింట్లు
కొత్తదనం లేని కథ
మలుపులు లేని స్క్రీన్‌ప్లే
ఎమోషన్స్ పండలేదు
ఎడిటింగ్
చివరిగా – నాగార్జున, నాని యాక్టింగ్ కోసం వెళ్ళవచ్చు
రేటింగ్ : 2.75/5