నిశ్శబ్దం రివ్యూ

0
348

నటీనటులు: అనుష్క-మాధవన్-మైకేల్ మ్యాడ్సన్-అంజలి-సుబ్బరాజు-షాలిని పాండే-అవసరాల శ్రీనివాస్ తదితరులు
సంగీతం: గోపీసుందర్
నేపథ్య సంగీతం: గిరీష్ గోపాలకృష్ణన్
ఛాయాగ్రహణం: శనీల్ డియో
స్క్రీన్ ప్లే-మాటలు: కోన వెంకట్
నిర్మాత: విశ్వప్రసాద్
కథ-దర్శకత్వం: హేమంత్ మధుకర్

చెలుగు చిత్ర పరిశ్రకు చెందిన స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నిశ్శబ్దం… ఈచిత్రాన్ని మధుకర్ దర్శకత్వం వహించాడు… ఈ చిత్రం తాఆగా ఓటీటీలో రిలీజ్ అయింది… ఇప్పుడు ఈ మూవీ అంచనాలు ఏ మేరకు ఉన్నాయో చూద్దాం…

కథ:

సాక్షి అనుష్క తన తండ్రి స్థాపించిన అనాథాశ్రమంలో పెరిగిన ఓ బదిరురాలు. ఐతే మాటలు రాకున్నా వినిపించకున్నా తన చిత్ర కళతో గొప్ప పేరు సంపాదిస్తుంది…. ప్రఖ్యాత వయొలెన్ కళాకారుడైన ఆంథోనీ మాధవన్ ఆమె కళకు ముగ్ధుడవుతాడు. వీళ్ల మధ్య పరిచయం ప్రేమగానూ మారుతుంది… సాక్షితో నిశ్చితార్థం కూడా చేసుకుని పెళ్లికి కూడా సిద్ధమైన ఆంథోనీ.. తను వేయాలనుకున్న ఒక ఆర్టుకు సంబంధించిన మెటీరియల్ కోసమని ఎన్నో ఏళ్ల కిందట ఓ జంట అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఓ భవంతికి తీసుకెళ్తాడు. కానీ ఆ భవంతిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని ఆంథోనీ హత్యకు గురవుతాడు… సాక్షి తీవ్ర గాయాలతో బయటికొస్తుంది. మరి ఆంథోనీని చంపిందెవరు అన్న కోణంలో విచారణ మొదలవుతుంది…

విశ్లేషణ…

నిశ్శబ్దంలో అనుష్కను ఆకర్షించడానికి మ్యూట్ క్యారెక్టరుంది… మాట్లాడకుండా తన హావభావాలతో భావోద్దేగాలు పండించడమనేది ఏ నటికైనా సవాల్… ఇప్పటికే ఎన్నో రకాల పాత్రలు పోషించిన అనుష్క ఈ పాత్ర పోషించడానికి ఇంతకంటే కారణం లేదనిపించింది… ముఖ్యంగా మిస్టరీ థ్రిల్లర్ కు కావాల్సిన అరెస్టింగ్ స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయిందనే చెప్పాలి… నిశ్శబ్దం నీరుగారి పోవడానికి ఎంతో సమయం పట్టలేదు…

ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా రంగంలోకి దిగిన అంజలితో రన్నింగ్ కామెంట్రీ ఇస్తున్నట్లుగా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే నిశ్శబ్దం ఎలా సాగబోతోందో సంకేతాలు అందుతాయి… ఇన్వెస్టిగేషన్ పేరుతో ప్రథమార్థాన్ని సాగితీసి ఇంటర్వేట్ ముంగిట మైకేల్ మ్యాడ్సన్ పాత్ర సంబంధించిన ట్విస్ట్ తో కథ పట్ల కొంత ఆసక్తి రేకిస్తారు…

కానీ ద్వితీయ యార్థంలో అనుష్క షాలినిల ఫ్లాష్ బ్యాక్ మొదలవడంతో మళ్లీ నీరసం వచ్చేస్తుంది… ఫ్లాష్ బ్యాక్ చివర్లో కథ మలుపు తిరిగే దగ్గర మళ్లీ కొంచే ఆసక్తి పుడుతుంది…

నటీనటులు…

ఈ చిత్రంలో అనుష్క మరీ అంత గొప్పగా చెప్పాలేము అలాని తీసివేయలేము… తన పాత్రకు అనుష్క జీవం తేవడానికి ప్రయత్నించింది… ఇక అంజలి పాత్ర ఒకే అనిపించింది…ఆంథోని పాత్ర మాధవన్ చేయదగ్గదికాదు… ఈచిత్రంలో ఆయన ప్రత్యేకథ కనిపించలేదు…

రేటింగ్ 2/5