ప్రిన్స్ మహేష్ బాబు అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు…. ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది.. యూఎస్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా విడుదల అయింది… ఈ సినిమాకు ఆరుషోలకు అనుమతి ఇవ్వడంతో థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు… రాత్రి ఒంటిగంట నుంచి థియేటర్లు కిక్కరిస్తున్నాయి… సైనికాధికారిగా మహేష్ తొలిసారి నటించడంతో ఫ్యాన్స్ మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది…
నటీనటులు: మహేశ్, రష్మిక మందన్న, విజయశాంతి, ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, సత్యదేవ్, పోసాని, సంగీత, హరితేజ, సుబ్బరాజు, అజయ్, వెన్నెలకిషోర్, రఘుబాబు, బండ్లగణేశ్, పవిత్ర లోకేశ్, రోహిణి, తమన్నా తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కెమెరా: రత్నవేలు
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం: అనిల్ రావిపూడి
సెన్సార్: యు/ఎ
వ్యవథి: 169 నిమిషాలు
కథ:
ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ (మహేశ్) సరిహద్దుల్లో తీవ్రవాదులతో పోరాడుతూ దేశాన్ని కాపాడుతుంటాడు. అదే రెజిమెంట్‌లోకి అదే పేరుతో మరో వ్యక్తి(సత్యదేవ్) జాయిన్ అవుతాడు. ఓ టెర్రరిస్ట్ ఎటాక్‌లో అజయ్(సత్యదేవ్) బాగా గాయపడతాడు. అతని త్వరలోనే చనిపోతాడు కాబట్టి ఆ విషయాన్ని అతని కుటుంబానికి చెప్పడానికి ఆర్మీ నిర్ణయించుకుంటుంది. అజయ్ తల్లి భారతి(విజయశాంతి) మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్. చిన్న తప్పును కూడా భరించని వ్యక్తి తన పెద్దకొడుకు ఆర్మీలో చనిపోయినప్పటికీ చిన్నకొడుకు ఆర్మీకి పంపుతుంది. కొన్ని విలువల ప్రకారం భారతి చెల్లెల పెళ్లి చేయడానికి అతని స్థానంలో మేజర్ అజయ్ కృష్ణ, ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్)తో కలిసి కర్నూలు బయలుదేరుతాడు. ట్రెయిన్‌లో సంస్కృతి(రష్మిక)కి కుటుంబంలతో కలిసి ప్రయాణిస్తుంటుంది. సంస్కృతికి వాళ్ల నాన్న(రావు రమేశ్) ఇష్టం లేని పెళ్లి చేయాలనుకుంటాడు. అదే సమయంలో ఆమె మేజర్ అజయ్‌ని చూసి ప్రేమిస్తుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడి, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. వారి నుండి తప్పించుకుని అజయ్ కర్నూలు చేరుకుంటాడు. అక్కడ భారతి, వాళ్ల కుటుంబం కనపడదు. ఆమెను మంత్రి నాగేంద్ర(ప్రకాశ్ రాజ్) చంపడానికి ప్రయత్నిస్తుంటారు. వారి భారి నుండిభారతిని ఆమె కుటుంబాన్ని కాపాడుతాడు మేజర్ అజయ్ కృష్ణ. అసలు నాగేంద్రతో భారతికి ఉన్న సమస్యేంటి? ఆమెను నాగేంద్ర ఎందుకు చంపాలనుకుంటాడు? మేజర్ అజయ్ కృష్ణ.. భారతి సమస్యను ఎలా తీర్చాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ వన్ మ్యాస్ ప్రదర్శించారనే చెప్పాలి… అలాగే 13 ఏళ్ల తర్వాత తెరంగేట్రం చేసిన విజయశాంతి ఎక్కడా తగ్గలేదు యాక్టింగ్ లోనూ డైలాగ్ లోనూ ఎక్కడా తగ్గలేదు… ఇక హీరోయిన్ రష్మిక సీన్లు డ్రమటిక్ గా కనిపించాయి… ఇక బండ్ల గణేష్ సీన్ కనిపించినంత సేపు రష్మిక నవ్వించింది… సినిమాలోని డైలాగులు కూడా అందరిని ఆకట్టుకున్నాయి… ఇక సెకెండ్ హాఫ్ కూడా సినిమాను అనిల్ రావుపుడి ఎక్కడా బోర్ కొట్టకుండా యాక్షన్ కామెడీతో ముందుకు నడిపించాడు… ఫస్ట్ హాప్ మహేష్ బాబుతో పాటు రష్మిక పాత్ర కూడా హైలెట్ చేశారు…. ఇక సెకెండ్ హాఫ్ విజయశాంతికి వదిలేశాడు.
టెర్రర్ ఎటాక్ నుంచి పిల్లలను ఎలా కాపాడే పైట్ తోపాటు నల్లమల అడవుల్లో ఫైట్ ను చాలా చక్కగా డిజైన్ చేశారు.. ముఖ్యంగా కమర్శియల్ ఫార్మట్ లో బాగా డిజైన్ చేశారు… ఈ సినిమాలో దేవి శ్రీ సంగీతం అద్బుతంగా ఉంది… ఈ సినిమాలో ప్రేటియాటిజమ్ లో ఓ బాంబ్ పేలినప్పుడు మూడు రంగుల జెండా వచ్చేలా ఉండే సీన్ కూడా ప్రేక్షకులను కట్టిపాడేతసింది…
ఇక కొన్ని సిన్లకు లాజిక్కులు కనపడవు… ఓవరాల్ గా మహేష్ బాబు తన కెరిర్ లో బిగ్గెస్ట్ చిత్రం అవుతుంది అన్నట్లుగానే ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీగా నిలిచిపోతుంది ఈ చిత్రం… అనిల్ రావుపుడి కెరియర్లో తొలిసారి మహేష్ బాబుతో సినిమా చేసినా కూడా ఎక్కడా బెరుకు లేకుండా ఫర్ ఫెక్ట్ గా చిత్రాన్ని నిర్మించాడు
రేటింగ్ 3.5