నటీనటులు: చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతిబాబు, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, రవికిషన్, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు, బ్రహ్మాజీ తదితరులు
మ్యూజిక్: అమిత్ త్రివేది,
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: జూలియస్ ఫాఖియం
సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్
నిర్మాత: రామ్‌చరణ్
దర్శకత్వం: సురేందర్‌రెడ్డి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి… తొలి తెలుగు తరం స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఆధారంగా చేసుకుని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. ఆ చిత్రానికి మెగా స్టార్ రామ్ చరణ్ తొలిసారి నిర్మాతగా వ్యవహంచారు. నేడు జాతిపిత మహాత్మగాంధీ జయంతి సంధర్భంగా చిత్ర యూనిట్ తెలుగు, కన్నడ తమిళం హిందీ మళయాలం భాషల్లో విడుదల చేసింది…
విడుదలై ఫస్ట్ షో నుంచే ప్రసంశలు అందుకుంటోంది… ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాన్ని దర్శకుడు ఎలా డైరెక్ట్ చేశాడు, చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర ఎలా నటించారు రామ్ చరణ్ కు నిర్మాత లక్షణాలు ఎంతమేరకు పని చేశాయి… నటీమనులు ఎలా నటించారో చూద్దాం..
కథ:
అనగనగా రాయలసీమలోని రేనాడు ప్రాంతం.. ఈ ప్రాంతాన్ని 61మంది పాలెగాళ్ళు పరిపాలన చేస్తుంటారు. ఆ 61 ప్రాంతాలు కూడా చిన్న చిన్న సంస్థానాలుగా ఉన్నాయి. అయితే, వీరి మధ్య ఐక్యత లేదు. ఒకరంటే మరొకరికి పడదు. అప్పటి వరకు ఆ ప్రాంతంలోని పన్నులను నిజాం నవాబులు వసూళ్లు చేసేవారు. బ్రిటిష్.. నిజాం నవాబుల మధ్య జరిగిన ఒప్పందంతో.. అక్కడి పన్నులను వసూలు చేసుకునే హక్కును బ్రిటిష్ పాలకులకు అప్పగిస్తుంది. వర్షాలు లేక, పంటలు పండగ నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా పన్నులు కట్టాలని బ్రిటిష్ పాలకులు ఒత్తిడి తీసుకొస్తారు. ప్రజలను హింసిస్తుంటారు. అలాంటి సమయంలోనే సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ పాలకులపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతాడు. అయితే, 61 పాలెగాళ్ళ మధ్య సఖ్యత లేకపోవడంతో మొదట్లో ఇబ్బందులు పడతారు. అనంతరం 61 మంది పాలెగాళ్లను ఒకతాటిపైకి తీసుకొచ్చి బ్రిటిష్ పాలకులను ఎలా ఎదుర్కొన్నారు అన్నది చిత్ర కథ.
విశ్లేషణ..
ఈ సినిమా స్రీన్ ప్లే రాయడం అంటే అంత సులువేమికాదు… స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వరుస సంఘటనలే… చెప్పుకోడాని ఎమి ఉండదు.. బ్రిటీష్ వారు మనవాళ్లని చప్పడం మనవాళ్లు బ్రిటీష్ వారిని చంపడం ఇలా ఒకరి తర్వాత ఒకరు చంపుకుంటారు… చివరకు విజయం కూడా సాధించిలేదు.. ఆలాంటికథన ఎక్కడా బోర్ కొట్టంగా స్రీన్ ప్లే రాయండంలో సురేందర్ రెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పాలి… అయితే సినిమా కథను మొదట రేనాడు గురించి కాకుండా ముందుగా ఝాన్సీలక్ష్మీ భాయ్ తో ప్రారంభించారు… బ్రిటీష్ వారు ఝాన్సీ భాయ్ పై దండెత్తుతారు…. వారిని ఆమె ఎదుర్కుంటుంది.. ఝాన్సీ సైనికులు కూడా బ్రిటిష్ వారిపై పోరాటం మొదటు పెడతారు…
ఆ సమయంలో ముందుగా బ్రిటీష్ వారిపై పోరాటం చేసింది మనం కదని ధక్షిణాన రేనాడు ప్రాంతానికి చెందిన ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పోరాటం చేసారని అనుష్క తెలుపడంతో ఈ కథ అప్పుడు రేనాడుపై ప్రాంతానికి మారుతుంది.. పాలెగాండ్లకు ఒకరంటే ఒకరికి పడకపోవడంతో నిజాం నావాబులు పన్ను వసులు చేసి పాలెగాండ్లకు అందించేవారు ఆ సమయంలో బ్రిటీష్ వారు నవాబుతో ఒప్పదం పెట్టుకుంటారు.. దాంతో బ్రిటీష్ వారు బలవంతంగా పన్ను వసులు చేసే సమయంలో కథ స్టార్ట్ అవుతుంది..
బ్రిటీష్ వారు ఆ ప్రాంత ప్రజలను ఎలా హింసించి పన్ను వసులు చేసేవారు, ఇవ్వకపోతే వారిని ఎలా హింసించేవారు ఒక్కోక్కటి రివిల్ చేసుకుంటు కథను ముందుకు తీసుకువెళ్ళే విధానం అద్బుతంగా ఉంటుంది… యుద్దం సంభవించిన సమయంలో చిరంజీవి డైలాగ్స్ కు గూస్ బమ్స్ వస్తాయి… ఇంటర్ వెల్ సమయంలో నరసింహారెడ్డి బ్రిటీష్ అధికారి తలను నరకడంతో బ్రిటీష్ అధికారులు యుద్దానిక దిగుతారు. ఇక అప్పటినుంచి సినిమా క్షనక్షణం ఎం జరుగబోతుందోనన్న సందేహం కలుగబోతుంది… ఇంటర్ వెల్ తర్వాత కథ ఫాస్ట్ గా నడుస్తుంది… మెగాస్టార్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా పోరాట సన్నివేశాలు ఉండటం విశేషం. ఇక క్లైమాక్స్ లో సైరా చిన్న సైన్యం పదివేలమంది బ్రిటిష్ సైనికులను చంపడం అన్నది లాజిక్ కు దూరంగా ఉంది. క్లైమాక్స్ ను భావోద్వేగాలతో ముగించాడు.
నటీ నటుల పాత్రలు…
నరసింహారెడ్డికి గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ పాత్ర అద్బుతం. రాజా పాండియగా విజయ్ సేతుపతి అవుకు రాజుగా సుదీప్ వీర రెడ్డిగా జగపతి బాబు నరసింహారెడ్డి భార్యలో సుబ్బమ్మగా నయనతార నరసింహారెడ్డి ప్రియురాలు లక్ష్మిగా తమన్న ఝాన్సీ లక్ష్మీభాయ్ గా అనుష్క నటించారు వీరందరు వారివారి పాత్రలో అద్బుతంగా నటించి చిత్రానికి ప్రాణం పోశారు అలాగే పాలెగాండ్లుగా ఉన్న వారు కూడా చక్కగా నటించారు.. ఈ సినిమాలో పవన్ వాయిస్ నాగబాబుల వాయిస్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రామ్ చరణ్ నిర్మాతగా ప్రజలను ఆకట్టుకున్నాడనే చెప్పాలి.
నెగెటివ్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ లో సాగతీత
లాజిక్ లేని పోరాటం
చివరిగా : సైరా.. తెలుగువాడు గర్వించే సినిమా..
రేటింగ్. 4.5