సూపర్ స్టార్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ | Mp Revanth Reddy Birthday Wishes To Super Star Krishna

Mp Revanth Reddy Birthday Wishes To Super Star Krishna in Twitter

0
181

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపి రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో సూపర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి సాదారణంగా సినిమా వాళ్లతో అంతగా సంబంధాలు కలిగి ఉన్నట్లు కనిపించరు.  కాని తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా “మరో వందేళ్లు అభిమానుల నుండి అభినందనలు అందుకో నటశేఖరా…! అంటు శుభాకాంక్షలను ట్విట్ చేసారు.

సూపర్ స్టార్ కృష్ణ తన సినిమా జీవితంలో అభిమానులను బాగా మెప్పిచిన సినిమా  “అల్లూరి సీతారామరాజు” . ఈ సినిమాలోని ఒక వీడియో సాంగ్ క్లిప్ తో ఎంపి రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా సూపర్ స్టార్ కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా వాళ్లకు ఎన్నడు కూడా పరోక్షంగానో, ప్రత్యక్షంగానో జన్మదిన శూభాకాంక్షలు తెలపని రేవంత్ రెడ్డి ఇలా ట్విట్టర్ ద్వారా నటశేఖరుడు కృష్ణకు శుభాకాంక్షలు చెప్పడం ఇటు రాజకీయ వర్గాల్లో, అటు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఎంపి రేవంత్ రెడ్డి చేసిన  ట్విట్  కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.

https://twitter.com/revanth_anumula/status/1399296035617271817