పవన్-రానా “భీమ్లానాయక్” టీజర్‌కు ముహూర్తం ఫిక్స్?

Muhurtam fix for Pawan-Rana "Bhimlanayak" teaser?

0
94

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్– రానా కాంబోలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లానాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రచించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, పాటలు సినిమా పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.

భీమ్లా నాయక్ పాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమా పవర్ స్టార్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రానాకు జోడీగా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కనిపించనుంది.

తాజాగా ఈ సినిమానుంచి టీజర్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చేనెల 14వ తేదీన గానీ ..15వ తేదీన గాని టీజర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.  ఇక పవన్ – రానా పాత్రలకి సంబంధించిన హైలైట్ సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేయనున్నట్టు తెలుస్తుంది.