ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నారు బన్నీ ఈ సినిమా తర్వాత ఆయన ఏ ప్రాజెక్ట్ చేస్తారు అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు… మొత్తానికి ఈ దసరా సమయానికి ఆయన తన కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించే అవకాశం ఉంది.. తాజాగా ఆయన మురుగదాస్ తో ఓ సినిమా చేయనున్నారు అనే వార్త టాలీవుడ్ కోలీవుడ్ లో వైరల్ అవుతోంది.
అయితే తాజాగా గజిని సినిమాలాంటి స్టోరీతో మురుగదాస్ సిద్దం అవుతున్నారు అని వార్తలు వస్తున్నాయి, ఇలాంటి చిత్రం బన్నీతో చేయాలి అని ప్లాన్ చేస్తున్నారట..ఇందుకు సంబంధించిన కథపై మురుగదాస్ కసరత్తు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.
ఇలాంటి స్టోరీ బన్నీకి బాగా సెట్ అవుతుంది అని ప్లాన్ చేస్తున్నారు…అయితే బన్నీకి ఇప్పటికే ఈ లైన్ వినిపించారు అని టాలీవుడ్ టాక్, దీనిపై త్వరలో ప్రకటన రానుంది అని అంటున్నారు. అయితే ఇది పాన్ ఇండియా చిత్రంగా వచ్చే అవకాశం ఉంది అని టాక్. మరి చూడాలి ఇది ఎంత వరకూ వాస్తవమో.